Friday, January 31, 2025

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ : కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపూర్ ఎంపీగా ఉన్న ఆయనపై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో అదుపు లోకి తీసుకున్నారు. సీతాపూర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగానే ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. భారీ పోలీస్ భద్రత నడుమ ఆయనను కోర్టుకు తీసుకెళ్లారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయమే ఎంపీ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. రెండు వారాల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని సూచించినట్టు సమాచారం. అంతకు ముందు ఇదే కేసులో ఎంపీ, ఎమ్‌ఎల్‌ఎ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధంలా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News