Monday, December 23, 2024

బిజెపిది ఎలాంటి జాతీయవాదం?: ఆ విషయాలపై ప్రధాని మౌనమేల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి వల్లించే జాతీయ వాదం నిజస్వరూపం బట్టబయలయ్యిందని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గోగోయ్ అన్నారు. ఇది ఎలాంటి జాతీయ వాదమని ఆయన ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమని అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ వెల్లడించిన విషయాలు, మేజర్ జనరల్ శంకర్ రాయచౌధురిపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కేసులు పెట్టడం దారుణమని ఆయనన్నారు.

అయినా ప్రధాని మోడి మౌనం పాటిస్తున్నారని అన్నారు. భద్రతా బలగాల రవాకు విమానం కోసం చేసిన అభ్యర్థనలను కూడా కేంద్రం తిరస్కరించిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు పౌర విమానయాన శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వైమానికదళం అధికారుల ప్రకారం సైనికుల రవాణా కోసం విమాన సర్వీసు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని అయినా ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.

Also Read: విడాకుల జారీ వ్యాజ్యంపై 1న సుప్రీం తీర్పు

2019 జనవరి 2 నుంచి 2019 ఫిబ్రవరి 3 మధ్య జైష్‌ఎమహమ్మద్ దాడి సూచిస్తూ కనీసం 11 ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు అందాయని అన్నారు. భద్రతా బలగాల కాన్వాయ్‌లు వారిపై సాఫ్ట్ టార్గెట్ గా ఉన్నాయని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌లు నిరంతరం వస్తున్నాయని ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు ఎందుకు విస్మరించబడ్డాయని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పెద్ద కాన్వాయ్ కదులుతున్నప్పుడు మొత్తం రూట్‌లో యాంటి ఐఈడి జామ్‌లు ముందుగా కదులుతాయని సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్ వెళుతున్నపుడు లింక్ రోడ్లు ఎందుకు మూయలేదని ప్రశ్నించారు.

జమ్మూ శ్రీనగర్ హైవేపై 300 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఎలా వచ్చిందని నిలదీశారు. పుల్వామాలో సైనికుల బలిదానం అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి చెప్పారని ఇంత భారీ కాన్వాయ్ హైవే పై తీసుకెళ్ళడం వల్లే జవాన్లు ప్రమాదంలో పడ్డారన్నారు. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్య ప్రభుత్వంపై ఉందని ఆయనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News