- Advertisement -
కాంగ్రెస్ ఎంపి గగోయ్ ట్వీటు
గువహతి : ఓ వైపు అసోం మునిగిపోతూ ఉంటే ప్రధాని మోడీ మహారాష్ట్ర సర్కారు కూల్చివేత పనిలో తీరికలేకుండా ఉన్నారని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ విమర్శించారు. కనివిని ఎరగని రీతిలో అసోంలో వరద పరిస్థితి ఉంది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని అక్కడికి వెళ్లడం లేదని, మహా అధికారం దక్కించుకోవాలనేదే ఆయనకు అమిత్ షాకు ఉన్న లక్షం అని మండిపడ్డారు. బిజెపికి అధికారమే అంతా, ఇందుకోసం బిజెపి గుడ్డెద్దు చేల్లో పడ్డట్లు రంకెలేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వెంటనే అసోం వెళ్లి , రిలీఫ్ ప్యాకెజ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టడం, గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి రావడమే షా మోడీ ధ్వయం ఆలోచన ఆశయం అంతా అని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నాయకులు అయిన గౌరవ్ తెలిపారు
- Advertisement -