- Advertisement -
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రచార వ్యూహం కోసమే తాము సమావేశమవుతున్నామని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యనేతల సలహాలు తీసుకొని ప్రచార రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. ఆగస్టు నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతం చేస్తామని, ముఖ్యనేతలందరూ కలిసి బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని, బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశం, శశిధర్ రెడ్డిల చేరికపై ఎలాంటి చర్చ జరగలేదని కోమటిరెడ్డి వివరించారు. కొత్తగా ఎవరు పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని, నల్లగొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: టిడిపి తప్పిదాలతోనే పోలవరం ఆలస్యం: అంబటి
- Advertisement -