Thursday, January 23, 2025

మంత్రి కెటిఆర్‌పై కాంగ్రెస్ ఎంపి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పై కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్.. లూట్, సూట్ సర్కార్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. భారాస ‘కే’ టాక్స్ వసూలుకు అలవాటు పడిందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్లను కెటిఆర్ భారీగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ‘కే’ టాక్స్ రూపంలో ప్రతినెలా రూ. వెయ్యి వసూలు చేస్తున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో రూ.900 కోట్లు పడ్డాయని జోస్యం చేప్పారు. కెటిఆర్ బినామీల ఖాతాల్లో రూ. 90వేల కోట్లెు జమయ్యాయయన్నారు. కెటిఆర్ ఎజెండా… ఫ్యామిలీ ఫస్ట్, ప్రజలు లాస్ట్ అని కోమటిరెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది అవినీతిపరులు జైలుకెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News