Thursday, December 26, 2024

బుల్లెట్ బండి నడిపిన రాహుల్ గాంధీ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

 

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మౌ పట్టణంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ నడిపి పార్టీలోని యువ నాయకులను మరోసారి ఆకర్షించారు. రాహుల్ బుల్లెట్ నడపడంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. రాహుల్ హెల్మెట్ ధరించి బండి నడిపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. శనివారం మధ్యప్రదేశ్‌లోని మోర్తక్క గ్రామంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లో రాహుల్ ఐదోరోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర ఇప్పటివరకు 34 జిల్లాలు, ఏడు రాష్ట్రాల మీదుగా సాగింది. మౌ పట్టణం నుంచి ఆదివారం యాత్ర ఇండోర్ లోకి ప్రవేశిస్తోంది. రాహుల్ బండి నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News