Friday, April 4, 2025

మతాల మధ్య చిచ్చుపడుతున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ, వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా బీజేపీ దేశంలో మత ఏకీకరణకు దిగుతూ, చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఆరోపించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ప్రసంగిస్తూ ఈ బిల్లు అబద్ధాల ఆధారంగా రూపొందించారని విమర్శించారు.బీజేపీ పార్టీ చాలా కాలంగా తప్పుడు సమాచారాన్ని ప్రసారం తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తోందని నసీర్ హుస్సేన్ ఆన్నారు.ప్రభుత్వం చెబుతున్న వక్ఫ్ ఆస్తులు చాలాకాలంగా వాడుకలో ఉన్నాయని, అవి వక్ఫ్ ఆస్తి అనడానికి అంతకన్నా ఎం రుజువు కావాలని కాంగ్రెస్ ఎంపీ నిలదీశారు. చాలా ఆస్తులు వక్ఫ్ వినియోగంలో ఉన్నాయి. అలాగే దేవాలయ భూములు , గురుద్వారాలు ఆయా మతస్తుల ఆధ్వర్యంలో ఉన్నాయని. పురాతన ప్రదేశాలకురుజువులు, సర్టిఫికెట్లు ఎలా ఉంటాయని సయ్యద్ నసీర్ హుస్సేన్ నిలదీశారు. అధికారపార్టీ అల్లర్లను ప్రేరేపించి తన ఓటు బ్యాంకుగా మార్చుకోడానికి యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025 లో పై మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ట్రిబ్యునల్ నిర్ణయాలను కోర్టులో అపీలు చేసుకునే హక్కు ఉందని గుర్తు చేశారు.

ఈ అంశంపై నసీర్ హుస్సేన్ ఈ వాదనను ప్రశ్నిస్తూ, వక్ఫ్ ఆస్తులపై సవాళ్లను నిరోధించే నిబంధన ఉన్నా.. పిటిషన్లు దాఖలు చేసిన అంశాన్ని గుర్తుచేశారు.అదే సమయంలో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ, వక్ఫ్ ఆస్తులపై సివిల్ దావాలు దాఖలు చేయలేమని స్పష్టం చేశారు. 2013 లో తొలగించిన నిబంధన ప్రకారం హైకోర్టులో రిట్ దాఖలు చేయవచ్చని, అయితే వాటి పరిధి పరిమితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ట్రిబ్యునల్ ఆదేశాలలో 99శాతం సమర్థింపబడుతున్నాయని అమిత్ షా వివరించారు.డిఎంకె నిరసన – నల్లదుస్తులు వక్ఫ్ సవరణబిల్లుకు వ్యతిరేకంగా డిఎంకె నాయకులు, సభ్యులు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. బిల్లు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్ర అసెంబ్లీలోనూ పార్టీ సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపినట్లు డిఎంకె ఎంపీ టీఆర్ బాలు తెలిపారు.వక్ఫ్ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. బిల్లు అమోదానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో తాము నల్లదుస్తుల ధరించి నిరసన తెలుపుతున్నట్లు బాలు స్పష్టం చేశారు.

బిల్లును వ్యతిరేకించిన టిఎంసీ
వక్ఫ్ సవరణబిల్లును తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. బిల్లుపై టీఎంసీ ఎంపీ నదిముల్ హక్ మాట్లాడుతూ, వక్ఫ్ ను సృష్టించే ముందు ఒక వ్యక్తి కనీసం ఐదు ఏళ్లు ఇస్లాంను ఆచరించాలనే నిబంధనను ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని, ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. ఒక వ్యక్తి ముస్లిం ఎవరు ధృవీకరించాలని నిలదీశారు. ఇది సమానత్వ సూత్రాలకు విరుద్ధం అని నదిముల్ హక్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News