Wednesday, January 15, 2025

కాంగ్రెస్ ఎంపి వసంత్ చవాన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వసంత్ చవాన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. 69 సంవత్సరాల వసంత్ చవాన్ సోమవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత వారం రోజులుగా ఆయన కిడ్నీ వ్యాధికి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్గలు తెలిపాయి.

గ్రామ సంచాయతీ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వసంత్ చవాన్ ఎంఎల్‌సిగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదటిసారి ఆయన 2024లో ఎంపీగా గెలిచారు. వసంత్ చవాన్ మృతికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం ప్రకటించారు. ఆయన మృతి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News