- Advertisement -
న్యూస్‌డెస్క్: ప్రతిపక్ష సభ్యుల నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం సాయంత్రానికి వాయిదా పడ్డాయి. అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదికపై జెపిసి వేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండు చేయడంతోపాటు రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఉభయ సభలలో రభస సృష్టించడంతో లోక్‌సభ సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. నల్ల దుస్తులు ధరించి లోక్‌సభకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాపై కాగితాలు విసిరి తమ నిరసన తెలియచేశారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించనందుకు ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో నిరసన కొనసాగించారు.
- Advertisement -