Friday, December 20, 2024

కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలి: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో బండి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. పథకాల కోసం కాంగ్రెస్ బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ.50 వేల కోట్లేనని, హామీల అమలుకు నిధులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. హామీలు నెరవేరుస్తారనే కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేశారని, హామీల అమలుపై అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట మారుస్తుందని చురకలంటించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. షరతుల పేరుతో కాంగ్రెస్ హామీల్లో కొతలు పెడుతుందని ధ్వజమెత్తారు. వెయ్యి మందిని పిలిచి పది మందికే భోజనం పెడతానంటే ఎలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీలేని భారత్‌ను ఊహించుకోలేమని స్పష్టం చేశారు. ప్రధాని ఎవరు అంటే కాంగ్రెస్ చెప్పలేని దుస్థితిలో ఉందని, తెలంగాణలో పోరాటాలు తాము చేస్తే అధికారం కాంగ్రెస్ దక్కించుకుందని బండి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News