ప్యాకేజిలకోసమే పోటీలో
స్రవంతి కోటరీతో ఇబ్బందులు
మన తెలంగాణ/మునుగోడు: మునుగోడులో గట్టి పట్టున్న కాంగ్రెస్ పార్టీ ఉప ఎ న్నికల్లో చేతులెత్తేసినట్లేనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భా విస్తున్నారు. రోజురోజుకు నాయకులు, కార్యకర్త లు పక్క పార్టీలో చేరుతున్నప్పటికీ పట్టించుకనే నా ధుడే కరువయ్యాడని తమలో తాము మధన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ తమకేమి పట్టన ట్లు వ్యవహిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ స్థా నాన్ని కాపాడుకోవాల్సిన నాయకులు అవకావాదుల రాజకీయాలతో ఓటమిని చే జేతులా కొని తెచ్చుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మేనేజ్‌మెంట్ తెలియనివా రి ని కోటరీగా పెట్టుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థినీ ఎ న్నికల్లో న ష్టపోతుందని వారు ఆక్రోషం వెలిబుచ్చుతున్నారు. కోటరీవల్ల నాయకలు, కార్యకర్తల కు మద్యన దూరం పెరిగిందనే వాదనలు బలంగా వినపడుతోంది.
క్షేత్రస్థాయి లో విషయాలు అభ్యర్థిని దృష్టికి తీసుకువెళ్లడంలో కోటరీ బృందం అ డ్డుపడుతోందని పలువురు నాయకలు , కార్యకర్త లు ఆరోపిస్తున్నారు. ఒకే కుటంబానికి చెం దిన ప్ర ధాన పార్టీల అభ్యర్థుల వ్యక్తిగత సహాయకులుగా పనిచేయడం పట్ల పలువిమర్శిలు ప్రచారంలో ఉ న్నాయి. అభ్యర్థుల వద్ద ధనార్జనే ధ్యేయంగా వ్యక్తిగత సహాయకులు నచ్చిన వారికి పెద్ద పీట వేస్తూ ఇతరులను చులకనగా చూస్తున్నట్టు నా యకులు, కార్యకర్తలు ఆవేధన వ్యక్తంచేస్తున్నారు. సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వారు కనీసం కార ్యకర్తల భోజన ఏర్పాట్లుకూడా పట్టించుకోకుండా అవమానపరుస్తున్నారని వాపోతున్న పరిస్థితి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి నిబద్దత గల కార్యకర్తలుగా పనిచేస్తుంటే కొత్తరకం నాయకుల చేతిలో అవమానాలు అవసరమా అని తమకు తామే ప్ర శ్నించుకుంటున్న పరిస్థితి నెలకొన్నదని చెప్పచ్చు.
ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే ప్యాకేజీలకోసమే ఎన్నికల్లో పోటీచేసినట్లుగా ఉందని కార్యకర్త లు తీవ్ర ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం మేలుకొ ని పొరపాట్లను సరిదిద్దుకొ ని ప్రచారం వేగవంతం చేయాలని సూచిస్తున్నా రు. వ్య క్తిగత సహాయకుల సలహాలు వినటం మా ని ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకునే ప్ర యత్నం చేయాలని , లేనిఎడల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం దక్కడం కూడా కష్టమేనని నిబద్దతగల కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.