Tuesday, January 7, 2025

సర్కార్‌కు ఆదాయం పెంచే సత్తా లేదు

- Advertisement -
- Advertisement -

మేం చేసిన అప్పులు బహిరంగ
రహస్యం ఏ వేదికపైనైనా చర్చకు
సిద్ధం సుపరిపాలన పేరిట
సిఎం డబ్బా కొట్టుకుంటున్నారు
రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందిదని, ఈ స ర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నారని, సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. సుపరిపాలన అని చెప్పాల్సింది సిఎం కాదు..ప్రజలు అని చెప్పారు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటరు… గోబెల్స్‌ను మించిన రేబెల్స్ ప్రచారం నీది అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం దాచిందని అసత్య ప్రచారం చేస్తున్నావు..ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉం డదు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. అప్పులు బహిరంగ రహస్యమే అని, గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయని చె ప్పారు.

ప్రతీ ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయని, ఆనాడు సిఎల్‌పి లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పులు ఎంతో, ఆదాయం ఎంతో తెలియదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొ త్తం అప్పు 4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా లెక్కల తో సహా తాను నిరూపించానని, ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్నానని స్పష్టం చేశారు. తన వాదనలో సత్యం ఉందని, స త్యాన్ని ఎదుర్కునే శక్తి రేవంత్‌రెడ్డి లేదు, ఆర్థిక మంత్రికి లేదన్నారు. ఏ ఛానల్ వేదికగా కూర్చుందాం.. ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో చెప్పు అంటూ సిఎంకు సవాల్ విసిరా రు.

ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం 7,200 కోట్ల ని ధులు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం..తెల్లవారితే ఖాతాల్లో వేస్తామని తొర్రూరు సభలో స్వయంగా తానే ప్రకటించానని తెలిపా రు. రైతు బంధు ఖాతాల్లో పడితే రేవంత్‌రెడ్డికి ఓట్లు డబ్బాలో పడవని భయమై, దుర్మార్గంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేశారని, నోటికి కాడికి వచ్చిన బుక్కను ఎగ్గొట్టిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పుడైతే 10వేలు, మేమొస్తే 15వేలు అని రైతులను ఊరించి, నమ్మించి ఓట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు రేవంత్‌రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు తాము నిలదీస్తే విధిలేక తాము సిద్ధం చేసిన నిధులతో రైతుల ఖాతాల్లో 5 వేలే వేశారని, 7500 ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు :

బిఆర్‌ఎస్ ప్రభుత్వం మంచి ఆర్థికవృద్ధితో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించిందని, కానీ ఇప్పటి ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమ లు చేసే చిత్తశుద్ది కాంగ్రెస్‌కు లేదని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ నేతలు ఏడాది కాలంగా చెబుతున్నారని, ప్రభుత్వ అప్పులన్నీ బహిరంగ రహస్యమే అని పేర్కొన్నారు. ఏటా అసెంబ్లీలో కాగ్ ప్రవేశపెట్టే నివేదికల్లో ఉంటాయని తెలిపారు. నాడు సిఎల్‌పిగా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పుల గురించి తెలియదా..? అని ప్ర శ్నించారు. గత ఎన్నికలకు ముందే రైతుబంధు వేసేందుకు తాము సిద్ధమయ్యామని, కానీ కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తు చేశారు. సంపూర్ణ రుణమాఫీతో పాటు వరంగల్ డిక్లరేషన్ పూర్తి చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం.. రేవంత్‌రెడ్డికి గుర్తులేకపోవచ్చు, కానీ ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, ఆయన మాట్లాడిన వీడియో ను పంపుతున్నా చూడండి అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News