- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ శుక్వారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమర్పించారు. నెహ్రూ ఇంటిపేరును ఉపయోగించడం లేదంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై గత నెల ప్రధాని మోడీ విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో ప్రసంగిస్తూ నెహ్రూ ఇంటిపేరును వాడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆర్టికల్ 356ని ప్రయోగించారంటూ మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై మోడీ ఆరోపణలు గుప్పించారు.
- Advertisement -