న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబరు 8 గా నిర్ణయించారు. పోటీలో ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17 న ఎన్నిక జరుగుతుంది. 19 న ఫలితాలు విడుదలవుతాయి. కాంగ్రెస్ పార్టీ బాధ్యతల స్వీకరణకు రాహుల్ గాంధీ విముఖత చూపడంతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాత్ , శశిథరూర్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాగా అధ్యక్ష ఎన్నికల్లో 9 వేల మంది ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా బుధవారం సోనియా గాంధీతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 1998 తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎఐసిసి అధ్యక్షుడిగా సీతారా కేసరిని ఎన్నుకున్న నేతలు, మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక పోవడంతో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- Advertisement -
- Advertisement -
- Advertisement -