Wednesday, January 22, 2025

అరచేతిని అడ్డుపెట్టి ఆపలేరు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ తోనే రైతుబంద్

రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర

కర్నాటకలో కాంగ్రెస్ గెలవగానే పెట్టుబడి సాయం నిలిపివేత
తెలంగాణలోనూ ఇదే కుట్రకు తెరలేపిన హస్తం పార్టీ

రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేయలేదా?

నాడు అధికారంలో ఉండీ.. నేడు ప్రతిపక్షంలో ఉండీ రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్

మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు రద్దు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ కు ట్ర అని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మంత్రి టి. హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతు ల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు ఇ సికి ఫిర్యాదు చేయలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నా యకులు కెకె, శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రైతుబంధు ఆపేశారని విమర్శించారు. ఇక్కడ కూడా రద్దు చేసేందుకు కుట్ర రై తుబంధు దక్కకూడదన్నదే కాంగ్రెస్ ఆలోచన అని, అందుకే అక్టోబర్ 23న కాంగ్రెస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే, రై తుబంధు కొత్త పథకం కాదని, ఇప్పటి వరకు 11 సార్లు ఇచ్చామని, మరోసారి పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణ ప్రభు త్వం కోరితే.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని తెలిపారు. దీనిపై బిజెపి, బిఆర్‌ఎస్, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారని గుర్తు చేశారు. రైతుబంధుపై అ నుమతి ఇస్తే ఎలా ఇస్తారు అని అంటారు.. మళ్లీ రద్దు చేయాలని ఫిర్యాదు చేస్తారు.. ఇప్పుడు బిజెపి, బిఆర్‌ఎస్ ఫెవికాల్ బంధం అని తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు రైతు బంధు ఇవ్వడమేంటని అన్నారని పేర్కొన్నారు. రైతులపై ప్రేమే ఉంటే.. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించొచ్చు కదా అని హరీశ్‌రావు అన్నారు. రైతుబంధుపై ఇసి అనుమతిని రద్దు చేసుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మరోసారి ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి వాస్తవం కాదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అక్టోబర్ 23న మాణిక్ రావు ఠాక్రే రైతుబంధు వేయొద్దు అని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పారని అన్నారు. భట్టి విక్రమార్క రైతుబంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులు బిచ్చగాల్లు అన్నారని విమర్శించారు. కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎం హైదరాబాద్‌లోనే ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కర్నాటక రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల నోటి దగ్గరి ముద్దను లాక్కున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఇసిని రేవంత్ బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, ఇసి అనుమతి రద్దు చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి రైతులపై కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు గమినిస్తున్నారని, ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
వ్యవసాయం దండగ అన్నోడికి వారసుడు రేవంత్
రేవంత్‌రెడ్డి.. వ్యవసాయం దండగ అన్నోడికి వారసుడు అని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అన్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుంచి రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ అదే పరిస్థితి కొనసాగించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అర్థరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది…2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసిందని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు… నీళ్ళు ఇవ్వలేదు… సాగు, మంచినీళ్ల కోసం అసెంబ్లీ వద్ద తాము ధర్నా చేస్తే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అధికారంలో ఉండి రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్.. రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది
రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పరిస్థితి దొంగే దొంగ అన్నట్టు ఉందని పేర్కొన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారిని అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి నవంబర్ 30న జరుగనున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని హరీశ్‌రావు ప్రజలను కోరారు.
దేశంలో రైతుబంధు సృష్టికర్త కెసిఆర్ అని, ఈ పథకంపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అరచేతిని అడ్డం పెట్టి రైతుబంధు ఆపలేరని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా సిఎం కెసిఆర్ రైతులకు రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలో గెలిస్తే అది చేస్తాం…ఇది చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారని,ఆ బాండ్ పేపర్లు చిత్తు కాగితంతో సమానమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ధమ్ముంటే ఉద్యోగాల విషయంపై చిక్కడపల్లిలో కాకుండా బెంగళూరులో మీటింగ్ పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలు ఇక్కడి ప్రజలు నమ్మరు అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో 80 సీట్లతో బిఆర్‌ఎస్ గెలుస్తుందని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు రైతుబంధు అపొచ్చు కానీ, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిచేది ఖాయమనారు. డిసెంబర్ 6 నుండి రైతుబంధు ఇచ్చేది ఖాయం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News