తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి
తుక్కుగూడ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో భూగర్బ జలాలు పడిపోయాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నింట నీళ్లు డెడ్ స్టోరేజ్కు వెళ్లపోయాయన్నారు. వర్షాకాలంలో వానలు రాక భూగర్భ జలాలు పడిపోయాయన్నారు.
రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ నెల 6వ తారీఖున సాయంత్రం 5.00 గంటలకు ‘తెలంగాణ జనజాతర’ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రియాంక గాంధీ ఇక్కడే ఆవిష్కరించనున్నట్లు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అది తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతోందని గర్వంగా ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే హాజరుకానున్నారని, జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని ప్రకటించారు. అందులో ఐదు గ్యారంటీలు ఉంటాయన్నారు. గతంలో ఆరు గ్రారంటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలోనే ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
త్రాగు నీరు, సాగు నీరు, విద్యుత్తు, పరిశ్రమలకు తమ ప్రాధాన్యత అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి త్రాగు నీటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయన్నారు.