Sunday, January 19, 2025

ప్రధానమైన లోపాలు మూడున్నాయి

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలు జరిగి ఇప్పటికి ఏడాది కాలమైనా గడవలేదు. ఆ ఎన్నికలలో బిజెపి కూటమికి ఎదురు దెబ్బలు తగిలి ‘ఇండియా’ కూటమి పుంజుకోగా, దానిపై ఈ కూటమి పార్టీలన్నీ సంతృప్తిని, గర్వాన్ని ప్రకటించాయి. వారందరికీ ఎనలేని ఆత్మవిశ్వాసం కలిగింది. ఈ భావనలు వారి మాటలు, చేతలలో ప్రతిఫలించాయి. కాంగ్రెస్ నాయకత్వ పటిమపట్ల కొంత విధేయతా భావం కూడా వ్యక్తమైంది.

మరొక వైపు బిజెపి కూటమి ఒక మేర ఆత్మ రక్షణలోపడి దిద్దుబాటు చర్యలు ఆరం భించింది. అటువంటిది, చూస్తూ చూస్తూండగానే ఈ సరికొత్త పరిస్థితి ఏర్పడి ‘ఇండియా’ కూటమి పక్షాలు కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టగా ఆ పార్టీ ఆత్మరక్షణలోకి వెళ్ళింది. ఇందుకు కారణం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి పరిమితమై వ్యాఖ్యానాలు వెలు వడుతున్నాయి గాని, కాంగ్రెస్ వైఫల్యాలు అందుకు మాత్రమే సంబంధించినవా? జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అట్లా తోచదు. ఈ రెండు పరాజయాల ప్రభావం తగినంత ఉన్నమాట కనిపిస్తున్నదే.

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీరు పట్ల అసంతృస్తి వ్యక్తం చేసిన ‘ఇండియా’ కూటమి పార్టీల సంఖ్య ఏడుకు చేరింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మూడు రోజుల క్రితం మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వం పార్టీ ఓడినప్పుడల్లా ఇవిఎంల గురించి ఆక్షేపణలు వ్యక్తం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఆర్‌జెడి, సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఇప్పటికే వేర్వేరు అంశాలపై కాంగ్రెస్‌ను విమర్శించటం తెలిసిందే. దీనితో, ఇంతవరకు ఇంకా ఏ వ్యాఖ్యాలూ చేయని పార్టీలుగా డిఎంకె, జెఎంఎం మాత్రమే మిగిలాయి. ఎందుకీ పరిస్థితి అన్నది ప్రశ్న.

లోక్‌సభ ఎన్నికలు జరిగి ఇప్పటికి ఏడాది కాలమైనా గడవలేదు. ఆ ఎన్నికలలో బిజెపి కూటమికి ఎదురు దెబ్బలు తగిలి ‘ఇండియా’ కూటమి పుంజుకోగా, దానిపై ఈ కూటమి పార్టీలన్నీ సంతృప్తిని, గర్వాన్ని ప్రకటించాయి. వారందరికీ ఎనలేని ఆత్మవిశ్వాసం కలిగింది. ఈ భావనలు వారి మాటలు, చేతలలో ప్రతిఫలించాయి. కాంగ్రెస్ నాయకత్వ పటిమపట్ల కొంత విధేయతా భావం కూడా వ్యక్తమైంది. మరొక వైపు బిజెపి కూటమి ఒక మేర ఆత్మ రక్షణలోపడి దిద్దుబాటు చర్యలు ఆరంభించింది. అటువంటిది, చూస్తూ చూస్తూండగానే ఈ సరికొత్త పరిస్థితి ఏర్పడి ‘ఇండియా’ కూటమి పక్షాలు కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టగా ఆ పార్టీ ఆత్మరక్షణలోకి వెళ్ళింది.

ఇందుకు కారణం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి పరిమితమై వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి గాని, కాంగ్రెస్ వైఫల్యాలు అందుకు మాత్రమే సంబంధించినవా? జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అట్లా తోచదు. ఈ రెండు పరాజయాల ప్రభావం తగినంత ఉన్నమాట కనిపిస్తున్నదే. ఆ కారణంగానే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ‘ఇండియా’ కూటమికి కాంగ్రెస్ బదులు తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమన్నారు. ఆమెకు పైన పేర్కొన్న తక్కిన పార్టీల నుంచి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లభించింది. చివరి వరకు ఏమీ మాట్లాడనిది నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు డిఎంకె, జెఎంఎంలు. కశ్మీర్, తమిళనాడు, జార్ఖండ్‌లలో ఆ పార్టీ నాయకత్వాన గల ప్రభుత్వాలలో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా ఉన్నందున ఆ మర్యాదలను పాటిస్తూ వారు మౌనంగా ఉన్నారనే అభిప్రాయం కలిగింది. కాని అదే సమయంలో ఆ మూడు పార్టీలు కాంగ్రెస్‌పై తక్కిన పార్టీల విమర్శల దృష్టా ఆ పార్టీకి మద్దతుగా కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనించదగ్గది. చివరికిపుడు ఈ స్థితిని సైతం భంగపరుస్తూ ఒమర్ అబ్దుల్లా ముందుకొచ్చారు. ఆ విధంగా ఇక మిగిలినవి డిఎంకె, జెఎంఎం మాత్రమే.

కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో మమతా బెనర్జీ తాను కూటమి నాయకత్వానికి సిద్ధమనటం, తనకు ఇతరులు మద్దతునివ్వటం ఒకటైతే, ఆప్ ఒకడుగు ముందుకు వెళ్ళి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు సీట్లివ్వబోమని చెప్పి అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. గత లోక్‌సభ ఎన్నికలలో తాము ఢిల్లీలో కొన్ని స్థానాలు కాంగ్రెస్‌కు వదిలినా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వారు తమకేమీ ఇవ్వకపోవటం అందుకొక కారణం. మరొక వైపు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ప్రకటించింది. ఇటువంటి వివిధ పరిణామాలన్నీ కాంగ్రెస్ పట్ల మిత్రపక్షాల అసంతృప్తికి, కోల్పోతున్న విశ్వాసానికి సూచనలు.

కాంగ్రెస్‌కు సంబంధించి ఇది తప్పకుండా తీవ్రమైన పరిస్థితి. ఇందుకు కారణాలను రోజువారీ పరిస్థితులు, పరిణామాలలో పైపైన వెతకటం ఒక దృష్టి అవుతుంది. లోతులలోకి వెళ్లి చూడటం మరొక దృష్టి అవుతుంది. డాక్టర్లు చెప్పేదేమిటి? ఒక మౌలికమైన వ్యాధి ఉన్నపుడు ఆ వ్యాధి లక్షణాలు అనేక రూపాలలో కనిపిస్తాయని, జరగవలసింది మౌలిక వ్యాధికి మౌలికమైన చికిత్స. అది జరగనంత కాలం వ్యాధి లక్షణాలు ఒకసారి పెచ్చరిల్లవచ్చు, మరొకసారి శాంతించవచ్చు. కాంగ్రెస్ విషయంలో జరుగుతున్నది సరిగా ఇదే. ఆ పార్టీలోకి మౌలికమైన బలహీనతలు ప్రవేశించటం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. అట్లా ఆ పార్టీ ఒక జారుడు బండ పైకి చేరింది. జారుతూ జారుతూ మధ్య మధ్య ఒక రాయికి లేదా చెట్లు కొమ్మకు తట్టుకుని తిరిగి అధికారంలోకి వస్తుండవచ్చు. కాని జారుడు బండ నుంచి వెలికి మాత్రం రాలేకపోయింది.
ఈ స్థితికి లేదా మౌలిక వ్యాధికి కారణాలు గతం నుంచి రెండు ఉండగా, ఇటీవల మూడవది తోడైంది. గతం నుంచి ఉన్నవి, మారుతున్న కాలానికి తగిన సైద్ధాంతికత, విధానాలు లేకపోవటం ఒకటైతే, సంస్థాపరమైన బలహీనతలు రెండవది. ఇటీవల కొత్తగా తోడైంది నాయకత్వ బలహీనతలు. ఏ పార్టీకి అయినా అ మూడు ఎంత కీలకమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అవి లేనప్పుడు అది మౌలిక వ్యాధే అవుతుంది. అది కొనసాగినంత కాలం జారుడు బండపైనే జారుతూ, అప్పుడప్పుడు ఏదైనా కలిసి వస్తేనో, ఇతర పార్టీలు విఫలమైతేనో, ఇతరులతో పొత్తుల ద్వారానో, కనీసం జూనియర్ భాగస్వామిగానో అధికారం సంపాదించగలగటం మినహా, ఈ రోజున కాంగ్రెస్‌కు మిగిలిన ఘనత ఏమున్నది?

పైన పేర్కొన్న మూడు కారణాలను కొంత వివరంగా విచారిస్తే అవి ఈ విధంగా కనిపిస్తాయి. కాంగ్రెస్‌కు తనదైన సైద్ధాంతికత, అందుక తగిన విధానాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో రూపు తీసుకున్నాయి. అవి ఏమిటో స్థూలంగా అందరికీ తెలిసినవే గనుక ఇక్కడ రాయనక్కరలేదు. ఆ సైద్ధాంతిక, విధానలు మన రాజ్యాంగంలో, చట్టాలలో, నెహ్రూ జీవించినంత కాలం పరిపాలనలో సంపూర్ణంగా కాకున్నా తగినంత ప్రతిఫలించాయి. ఇందిరా గాంధీ కాలం కొంత ఒడిదుడుకులుగా సాగగా, సమస్య ఆ తర్వాత నుంచి మొదలైంది. పాలనా వైఫల్యాల వల్ల ఒక్కొక్క సామాజి కవర్గం, వాటిలో పాటు ప్రాంతీయ శక్తులు దూరమవుతుండగా, ఆర్థిక సంస్కరణల వల్ల ధనిక పేద తారతమ్యాలు వేగంగా పెరుగుతుండటంతో ఈ వర్గాలు మరింతగా దూరమవుతూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పరిధిలోకి మళ్లీ రాలేదు. అందుకు కావలసిన సైద్ధాంతికతలు, విధానాలు ఏమిటో బోధపరచుకొని సవరించుకునే పని కాంగ్రెస్ నాయకత్వం చేయలేదు, చేయటం లేదు.

వ్యవస్థాగత బలహీనతలు ఇందిరా గాంధి తన అధికార కేంద్రీకరణ కోసం ఇతర నాయకులను, ప్రాంతీయ నాయకత్వాలను, పార్టీ నిర్మాణాన్ని కూడా బలహీనపరచటంతో మొదలయ్యాయి. ఈ ప్రధానమైన లోపం నేటికీ కొనసాగుతున్నది. దీనిని సరిదిద్దే ప్రయత్నాలు లేవు. ఇక నాయకత్వం విషయానికి వస్తే, సోనియా గాంధీ తన పరిణతితో, సంయమనంతో సవ్యంగానే సాగినా, రాహుల్ గాంధీ 20 సంవత్సరాల క్రితం 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినా, ప్రదర్శిస్తున్న పరిణతి, సంయమనం, సమర్థత, దార్శనికత ఇంత వరకేమీ లేవు. ప్రియాంకలో ఆ లక్షణాలు ఉండగలవనుకోవటం భ్రమ. ఈ విధమైన మౌలిక లోపాలతో మౌలిక వ్యాధి స్థితిలో ఉన్న కాంగ్రెస్ పట్ల మిత్ర పక్షాల అసంతృప్తి పూర్తిగా సహజమైనది. ప్రధానమైన లోపాలు మూడున్నాయి.

దూరదృష్టి

టంకశాల అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News