Monday, December 23, 2024

మన కాంగ్రెస్ మన మునుగోడు పేరుతో ప్రచారం: బోసురాజు

- Advertisement -
- Advertisement -

Congress party campaign in Munugode

నల్లగొండ: మన కాంగ్రెస్ మన మునుగోడు పేరుతో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఎఐసిసి కార్యదర్శి బోసురాజు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇందిరా భవన్ లో మునుగోడు నియోజక వర్గ గ్రామ సమన్వయ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ  సందర్భంగా బోసు రాజు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని, మనం కష్టపడి పనిచేస్తే గెలువును ఎవరు ఆపలేరన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 20వ తేదీ నాడు ప్రతి గ్రామంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలని, గాంధీ కుటుంబాల త్యాగాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో గ్రామ గ్రామాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

 టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో ఎఐసిసి ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఎఐసిసి కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జవీద్, రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, నాయకులు, గ్రామ సమన్వయ కర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News