Sunday, December 22, 2024

రాజీవ్ బతికి ఉంటే అయోధ్యలో రామమందిరం పూర్తి చేసేవారు: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మతసామరస్యానికి కట్టుబడి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఎప్పుడో అయోధ్యలో రామమందిరం పూర్తి అయ్యేదని, కోర్టు తీర్పు ప్రకారమే రామమందిరం నిర్మించామన్నారు. లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి తీరుతోనే రామమందిర నిర్మాణం ఆలస్యమైందన్నారు. బుల్డోజర్ కల్చర్ తెచ్చింది బిజెపి ప్రభుత్వం అని విరుచుకపడ్డారు.  జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News