Wednesday, January 22, 2025

26 మందితో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:కర్ణాటకలో విజ య బావుట మోగించిన కాంగ్రెస్ పార్టీ తెలం గాణలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీ అధికారమే లక్ష్యంగా ఎన్నికల కమిటీని తాజాగా నియమించింది. ఈ కమిటీకి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నా రు. ఈ కమిటీలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, హ న్మంత్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, రేణుకాచౌదరి, పోడెం వీరయ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 29 మంది సభ్యులుగా నియమించింది.

ఎక్స్‌అఫిషి యో సభ్యులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులకు చోటు కల్పిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వు లు జారీ చేశారు. అయితే ఎన్నికల కమిటీలో త న పేరు లేకపోవడంతో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారిని విస్మరించారని అనుచరుల దగ్గర పొన్నం ఆవేదన వ్యక్తం చేశా రు.రేవంత్ రెడ్డికి తాను అంత సపోర్ట్ ఇచ్చినా త నకు అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News