Tuesday, April 1, 2025

పివి పేరెత్తే అర్హతలేదు

- Advertisement -
- Advertisement -

గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్

పి.వికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాలకు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు క్షమాపణ చెప్పాలి

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. పివిపై రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలపై కెటిఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ టివి ఛానల్‌తో మాట్లాడుతూ, రాహుల్, ప్రియాంకగాంధీ మాటలు చాలా బాధ్యతరాహిత్యమని అన్నారు. ప్రధానిగా పనిచేసిన నాయకుడికే పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించలేదా? అని ప్రశ్నించారు. పి.వి నరసింహారావు అవమానభారంతో చనిపోతే కనీసం ఆయన భౌతిక కాయాన్ని అక్బర్ రోడ్డులోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలోకి కూడా అనుమతించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

దేశంలో ఏ ప్రధాని మరణించినా ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తారని, కానీ కాంగ్రెస్ పార్టీ పి.వి పార్ధివ దేహాన్ని నిర్ధయగా హైదరాబాద్‌కు తరలించిందని గుర్తు చేశారు. చివరికి అందరి ప్రధానులకు ఉన్నట్లు ఢిల్లీలో మోమోరియల్ కూడా నిర్మించలేదని అన్నారు. పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాలకు ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పి.వి. నరసింహారావు శతజయంతి రోజున ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశామని డిమాండ్ చేసిందని, దానిని నిలబెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పి.వి జతశయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనను గొప్పగా గౌరవించుకుందని తెలిపారు.

Surabhi Vani Devi

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News