Sunday, December 22, 2024

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత కేవిపి రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కచ్చితంగా అధికారంలోకి వస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలిండియా కాంగ్రెస్ ఫిషర్మెన్ విభా గం జాతీయ కార్యదర్శి బిజ్జి శత్రురావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవిపి రామ చందర్ రావును గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అధికారంలో వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా ఏ ప్రాంతానికి చెందిన నాయ కులు ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ బలోపేతంగా చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా శాయ శక్తుల సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. కేవిపిని కలిసిన వారిలో కన్నా డానియేల్, శ్రీరాముల యాదగిరి, ఖదీర్, శ్రీకాంత్ యాదవ్, సురేష్, అంజయ్య, సి. వినోద్, రామకృష్ణ, మొయిద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News