Saturday, December 28, 2024

రైతులపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: రైతులకు మూడు గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల కోదాడ బీఆర్‌ఎస్ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం కోదాడ పట్టణంలోని రంగా థియోటర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ని రసిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి ఆ యన దిష్టిబొమ్మ దహనం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగల మారడాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల విషం కక్కుతు ందన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే బేషరతుగా తెలంగాణ రైతులకు బహిరం గ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణాలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ అ ధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మా మధుసుదన్, పార్టీ యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్, పార్టీ యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్, పార్టీ మాజీ అధ్యక్షులు కుక్కడపు బాబు, కౌన్సిలర్లు కోట మధు, కల్లూరి పద్మజ. కందుల చంద్రశేఖర్, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్‌యాదవ్, గుండెల సూర్యనారాయణ, ఖాజా మోహినుద్దీన్, చింతల నాగేశ్వరరావు, మెదర లలిత, నెమ్మాది దేవమణి, గ్రంథాలయ చైర్మన్ రహీం, సంపెట ఉపేందర్, పోటు రంగారావు, గంధం పాండు, టీఆర్‌ఎస్వీ అధ్యక్షులు వంశీ, నాని, అభిధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News