Monday, November 25, 2024

రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయే

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. జగిత్యాల రూరల్ మండల కల్లెడ గ్రామంలో రైతు వేదికలో రైతులతో కలిసి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలపై రైతులతో కలిసి చర్చించారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రాష్ట్రం అన్నిరంగాలైన కరెంట్, విద్య, వ్యవసాయం, వైద్యం, పెన్షన్, కుల వృత్తులు అన్నింట్లో తెలంగాణ అభివృద్ది చెందిందని గుర్తు చేశారు.

గుల్లపెట్ లో చెక్ డ్యాం మత్తడి పారుతుందని, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు రైతుల పాలిట రాబందుల్లా తయారయ్యారు అని అన్నారు. కల్లేడ రైతు వేదిక క్లస్టర్ గ్రామాల్లో 5200 ఎకరాలలో పంటల సాగు అవుతుందని, గతంలో కంటే 2300 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. క్లస్టర్ గ్రామాల్లో ఇప్పటి వరకు 21 కోట్ల 26 లక్షల రైతు బందు జమ అయ్యాయని పేర్కొన్నారు.

రైతు ఏ కారణంతో మరణించిన కల్లేడ క్లస్టర్‌లో 2 కోట్ల 85 లక్షల రూపాయలు రైతు భీమా మరణించిన రైతు కుటుంబాల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం దండగ అనే నాయకులకు రైతులు బుద్ది చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తె చీకట్లో ఉంటారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.

15 వేల మెగా వాట్ల నుండి 18 వేల మెగా వాట్ల కరెంట్ ఇస్తామని సిఎండి ప్రభాకర్ రావు ప్రకటించినట్లు పేర్కొన్నారు. మంచి సుపరి పాలన వల్లనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమయ్యిందన్నారు. ఈ క్లస్టర్ గ్రామాల్లో గతానికి ఇప్పటికీ 2 వేల ఎకరాలు విస్తీర్ణం ఎలా పెరిగింది అని ప్రశ్న వేసుకోవాలన్నారు.

అన్ని వేళలా ప్రజలకు,రైతులకు అండగా ఉంటామని అన్నారు. మొగులుకు రైతులు మొఖం పెట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి పడమర నుండి తూర్పునకు నీరు పారిస్తున్న అపర భగీరథుడు కేసిఆర్ అని తెలిపారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు. ఆంధ్ర అన్నపూర్ణ గా పిలిచే ఆంధ్రాలో నేడు బియ్యం కొరత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,జిల్లా రైతు బందు సభ్యులు బాల ముకుందం, పాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News