Monday, December 23, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది: ఏఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ

- Advertisement -
- Advertisement -

సమష్టిగా కష్టపడి పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో
మరింత మంచి ఫలితాలు సాధిస్తాం
పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యత చాలా కీలకమైంది

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, సమష్టిగా కష్టపడి పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన టిపిసిసి అధికార ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యత చాలా కీలకమైందన్నారు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి మతతత్వ రాజకీయాలను ఎండగట్టాలన్నారు. బిజెపి తెలంగాణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని, కొన్ని నియోజకవర్గాల్లో వారు ఇప్పటికే లోతుగా పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు మరింత అప్రమత్తం కావాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవగానే నాయకులు కొంచెం విశ్రాంతిలో ఉంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్లీ పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని ఆమె సూచించారు. దేశంలో కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి అత్యంత బాధ్యత ఉందని, మనం కష్టపడి మరింత మంచి ఫలితాలు అందించాలని దీపాదాస్ మున్షీ తెలిపారు.
15 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో త్వరలో సమావేశం
కాగా అంతకు ముందు గాంధీభవన్ కు వచ్చిన ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై 15 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News