Wednesday, January 22, 2025

గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్ టికెట్ల లొల్లి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల టికెట్ల లొల్లి గాంధీభవన్ ఆవరణ ధర్నాలు, ఆసంతృప్తులు, నిరసన గళంతో హోరెత్తుతూనే ఉంది. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ అభ్యర్థిత్వం రాజిరెడ్డికి ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, ఆక్రోశంతో ఊగిపోయారు. రాజిరెడ్డి వంటి దొంగకు, కోవార్టుకి టికెట్ ఇస్తారా ! అతన్ని వెంటనే మార్చాలి, బీసీకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ కేకలు వేస్తూ ఒక్కసారిగా ముగ్గురు పార్టీ శ్రేణుల వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వెంటనే నాయకులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం గాంధీభవన్ ప్రాంగణం కలకలం రేగింది. నర్సాపూర్ నుంచి పలు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రాజిరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని తీవ్ర స్థాయిలో నిరసన గళం విప్పారు. బీఆర్‌ఎస్ కోవార్డు, ఆపార్టీకి అమ్ముడుపోయే వ్యక్తి అంటూ నినాదాలు మిన్నంటాయి.

రాజిరెడ్డి టికెట్ రద్దు చేసి, బీసీ నాయకుడు గాలి అనీల్‌కుమార్‌కు పార్టీ టికెట్ ఇవ్వాలి, అసమర్ధులకు పార్టీ అందలం ఎక్కిస్తుందా ! బీఆర్‌ఎస్ కోవార్డు హఠావ్, నర్సాపూర్ బచావ్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్లేశ్, ఆంజనేయులు, రిజ్వాన్, సురేశ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వేళ నర్సాపూర్‌లో రాజిరెడ్డి గెలిచినట్లయితే తొలుత బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయే వ్యక్తి అని ఆరోపించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ పార్టీ కోసం పరితపిస్తున్న బీసీ నేత అనీల్‌కుమార్‌ను కాదంటూ దొంగకు టికెట్ ఇస్తారా ! అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వెళ్లగక్కారు. రాజిరెడ్డికి తాము పనిచేయబోం, ఆయనను ఓడిస్తాం.. ఆయన టికెట్ క్యాన్సిల్ చేయకపోతే అందరం కలిసి కట్టుగా పార్టీకి ముకుమ్మాడిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు.

ఉన్నట్టుండి నర్సాపూర్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు అజ్మత్, ఖాదీర్, సమీలు రాజిరెడ్డి డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ వెంట తెచ్చుకున్న బాటిళ్లలో పెట్రోల్ వంటిపై పోసుకున్నారు. వెంటనే తెరుకున్న నాయకులు వారిని చుట్టుముట్టి అడ్డుకున్నారు. వారిని నచ్చచెప్పి వారించడంతో ఘటన తప్పింది. ఓకేసారి మగ్గురు కలిసి టికెట్ చిచ్చు ఆత్మహత్యాయత్నానికి దారితీసి.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో తీవ్ర కలకలం సృష్ఠించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News