Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికల జోరు

- Advertisement -
- Advertisement -

మెదక్: పలు పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం బిఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు పేదల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తూ భారాసలో చేరుతున్నారు.

శుక్రవారం మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలుమెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన పెద్ద సత్తయ్య, ప్రవీణ్, సాయిబాబా, రమేష్, కిష్టయ్య, అంజయ్య, రాజు, లింబాద్రి,వెంకటరాములు, యాదగిరి, తులసిరామ్, రవిలాల్‌తోపాటు 50 మందిపార్టీలో చేరారు. వీరికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆద్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, మరింత అభివృద్ది చెందాలంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మండల పార్టీ అద్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News