Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీ బిసి ఓట్ల కోసం మోసపూరిత వాగ్దానాలు: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అధిష్టానం ఏ కారణంతో వేములవాడ, సంగారెడ్డి సీట్లు చివరి నిమిషంలో మార్చారనేది తనకు తెలియదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. సోమాజిగూడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బిసి ఓట్ల కోసం అనేక పాట్లు పడుతోందని, డిక్లరేషన్‌లో ఏమాత్రం పస లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ కొత్త సీసాలో పాత సారా పోసినట్టుందని చురకలంటించారు.

కాంగ్రెస్‌లో సమర్థవంతమైన బిసి నాయకులు ఉన్నా, కులం పేరు మీద వారిని పక్కన పెట్టిన చరిత్ర ఉందని,  ఆపార్టీలో ఉన్న రెడ్డిలు ఎవరికి వాళ్ళు సిఎంగా ప్రకటించుకుంటున్నారని విమర్శలు చేశారు. పెన్షన్ కోసం మాత్రమే బిసిలు అర్హులా , సిఎంకు పనికి రారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సిద్ధరామయ్య బిసి ముసుగులో ఉండి కుల గణాంక విషయాలు బయటపెట్టలేదని విమర్శలు చేశారు. బిజేపియేతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని, బిజెపి పాలిత ప్రాంతాల్లో మాత్రమే బిసిల రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన 26 బిసి కులాల ఊసేదని?.. తమ పార్టీ అధికారంలోకి రాగానే జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News