Sunday, December 22, 2024

చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం

- Advertisement -
- Advertisement -

Congress party office burnt in Chandur

చండూర్ : మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుండగులు దగ్ధం చేశారు. ఈ సంఘటనపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చండూర్ మండలంలో రేవంత్ రెడ్డి ప్రచారం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ చర్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి బిజెపికి వణుకు పుట్టిందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్.పి కార్యాలయం ముందు తాను ధర్నా చేస్తానని రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News