Thursday, January 23, 2025

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బోథ్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బోథ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయ భేరి సభ నిర్వహించింది. ఈ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేశారు. కెసిఆర్ వల్ల బోథ్ కు నీళ్లు రాలేదు… కెసిఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోందన్నారు. బోథ్ నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండని రేవంత్ కోరారు. బోథ్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాద్యత నేను తీసుకుంటానని వెల్లడించారు.

కాంగ్రెస్ కు ఓటు వేయండి.. ఆదిలాబాద్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా.. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కెసిఆర్ పరామర్శించలేదని ఆయన ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మహిళకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News