Monday, December 23, 2024

రాహుల్ నో అంటే నో

- Advertisement -
- Advertisement -

Congress party president election

కాంగ్రెస్‌లో అధ్యక్ష సంకటం
సోనియాకు అనారోగ్య సమస్య
ప్రియాంకకు యుపి చేదు షాక్
ఎన్నిక ప్రక్రియకు బ్రేక్?

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో ఇప్పుడు అధ్యక్ష బాధ్యతల సందిగ్ధత నెలకొంది. ఈ వారం పార్టీ అధ్యక్షులు ఎవరనేది తేలాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటికీ ప్రతిష్టంభన వీడటం లేదు. తాను తిరిగి పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకునేది లేదని రాహుల్ గాంధీ తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈ స్థానంలో తాను కొనసాగడం కుదరదని సోనియా గాంధీ స్పష్టం చేశారు. దీనితో పార్టీ వర్గాలు ప్రియాంక గాంధీ వాద్రాను మెప్పించేందుకు యత్నిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. సోనియా ఈ స్థానంలోకి వచ్చినా ఇటీవలి కాలంలో ఆమె అనారోగ్య సమస్యలతో పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఏదో విధంగా రాహుల్‌ను ఒప్పించి తిరిగి గాంధీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు పలుసార్లు యత్నించినా రాహుల్ విముఖత చూపుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక ఒక్కరే ఈ కుటుంబం తరఫున నేతగా వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ ప్రచారం సాగించినా ఫలితాలు అత్యంత దారుణంగా వెలువడటంతో , పలువురు నేతలు ఆమె సారధ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పార్టీ తదుపరి నాయకత్వ సమస్యపై ఏకాభిప్రాయం కుదరనందున పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శనివారం ఆరంభం అయ్యే దశలో పలు రకాల నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటి దిగ్బంధ స్థితి దీనిని ఛేదించే చర్యల గురించి పార్టీ అధికారికంగా ఎటువంటి స్పందనకు దిగలేదు. రాహుల్ గాంధీ అంగీకరించడం లేదని, అయినా తాము ఆయనను ఈ విషయంలో ఇప్పటికీ మెప్పించేందుకు అభ్యర్థిస్తున్నామని కాంగ్రెస్ ప్రముఖులు భక్త చరణ్ దాస్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఆయన తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఈ కీలక బాధ్యతల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా చెప్పాల్సి ఉందని దాస్ రాహుల్‌ను కేంద్రీకృతం చేసుకుని స్పందించారు.

మోడీ సర్కారుపై దాడి బాధ్యతల్లో రాహుల్
అధికారికంగా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోకపోయినా, పట్టువీడకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉధృతం చేస్తూ వస్తున్నారు. పలు కీలక అంశాలపై ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతున్నారు. సెప్టెంబర్‌లో ఓ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారు. ఇప్పటికైతే పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ఎటువంటి స్పష్టత లేదని, రాహుల్ నుంచి ఈ ప్రభుత్వంపై పద్ధతి ప్రకారం విమర్శల కార్యక్రమం సాగుతుందని హర్యానా మాజీ సిఎం భూపీందర్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News