31తేదీ ఉ.10గం.కు డప్పులు, గంటల మోత
పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి
31నుంచి ఏప్రిల్ 7వరకు 3దశల్లో ఉద్యమం
న్యూఢిల్లీ : దేశంలో విపరీత స్థాయిలో పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసనకు దిగుతుంది. జాతీయ స్థా యి ఉద్యమంలో భాగం గా వ చ్చే గురువారం (31 వ తేదీ) పార్టీ తరఫున ఉదయం 11 గంటలకు డప్పులు కొట్ట డం, గంటలు మోగించడం జరుగుతుంది. ప్రజలు విశేషరీతిలో ఈ నిరసనలో పా ల్గొనాలని పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శనివారం తెలిపింది. అంతర్జాతీయ ముడిచమురు ధరల సాకుతో ఇక్కడ ఇంధన ధరలను ఆకాశపు బాట పట్టిస్తూ కేంద్రం సిగ్గు లేకుం డా ప్రజలను పిప్పిపిప్పి చేస్తోంది. ఈ జులుం ఆ గేందుకు ఈ చప్పుళ్ల తో తాము ఉద్యమిస్తామని, ఈ మే రకు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం విలేకరులకు తెలిపారు.
ధరలపై ని రసన ఉద్యమాలను మూడు దశలు గా నిర్వహిస్తామని చెప్పారు. కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం చెవిటి ది. ప్రజల కష్టనష్టాల రొదలను వినలేకపోతోంది. వీరి కర్ణభేరిల తుప్పు వదిలేలా జనం చప్పుళ్లు కంపెనీలు ఉండాలని కాంగ్రెస్ ప్రతినిధి పిలుపు నిచ్చారు. పెట్రో డీజిల్ ధరలకు నిరసనగా వి నూత్న కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇండ్ల ముందు , బహిరంగ స్థలాలలో వంటగ్యాసు సిలిండర్లకు పూలదండలు వేస్తారు. వాటి కి అగరుబత్తీలు వెలిగిస్తారు. ఇదేసమయంలో గంటలు కొట్టడం, డ్రమ్ములు మోగించడం జరుగుతుంది. దేశంలో కొవిడ్ ఉధృతి దశలో బిజెపి ప్రభుత్వం ఇదే విధమైన కార్యక్రమం నిర్వహించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకునే కాంగ్రెస్ ఇప్పుడీ పద్ధతిలో సాగేందుకు కార్యాచరణ చేపట్టింది.
బిజెపి సర్కారుకు 8 ఏండ్లలో రూ 26 లక్షల కొట్ల ఆమ్దానీ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల పెంపుదలతో పెట్రోలు డీజిల్ ద్వారా ఎనిమిదేళ్ల కాలంలో ఏకంగా రూ 26 లక్షల కోట్లు ప్రజల నుంచి రాబట్టుకుంది. ఇది పూర్తిగా ప్రజలను వంచించడం వారి పట్ల దగాకు దిగడమే అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజలపై ధరల భారం తగ్గాల్సి ఉంది. ప్రజలకు ఉపశమనం దిశలో తమ పార్టీ తరఫున మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్‌ను మూడు దశలలో నిరసనల రూపంలో చేపడుతామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 31 ఎప్రిల్ 7 మధ్య ఈ త్రి భాగ కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించారు.