మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా ఉన్నప్పటికి కేవలం ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ గెలుపు దీమాతో ఒకడుగు ముందుకేసి రచ్చబండ, హత్‌సే హత్ జోడో అభియాన్‌తో పిసిసి ఉపాధక్షుడు మల్‌రెడ్డి రంగారెడ్డి, పిసిసి సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గంలో ఇరువురు గడప గడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళి రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురించి చెప్పి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఉద్యోగాల అవకాశాలను మెరుగుపర్చుతామని చెప్పుతూ ప్రజలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇరువురిపై డేగ కన్నువేసింది. పిసిసి కార్యాదర్శి దండెం రాంరెడ్డి నేను సైతం ఎమ్మెల్యే రేసులో ఉన్నానని చెప్పుతూ పార్టీ యిచ్చిన అనేక కార్యాక్రమాలలో భాగస్వాములయ్యా రు.ఈ మధ్య పార్టీ కార్యాక్రమాలకు గ్రామ, మండల పార్టీల అధ్యక్షులను, సమాచారం ఇవ్వకుండా సొంతంగా పార్టీ కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారనే సమాచారం అధిష్టానానికి సీనియర్ నేతలు పిర్యాదు చేసినప్పటికి అధిస్ఠానం దండెం రాంరెడ్డి పార్టీని పక్కదోవ పట్టిస్తున్నారనే ఉద్దెశంతో ఆయనకు షోకాజ్ నోటిస్ అందజేసి పార్టీ ను ంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈయన కూడ ఎ మ్మెల్యే రేసులో ఉన్నానని ప్రచారం చేసుకున్న విషయం విదితమే.
ఈ విషయం తెలుసుకున్న మల్‌రెడ్డి, రంగారె డ్డి, మర్రి నిరంజన్‌రెడ్డి ఇరువురు కూడ పార్టీని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతోనే ఏ కార్యాక్రమం చేసిన సమాచారం ఇవ్వాలనిపిసిసి సూచించినట్లు తెలిసింది. దీంతో ఒకడుగు ముందుకేసి కాస్తా జాగ్రత్తపడ్డట్లు వినికిడి. అంతే కాకుండా ఇబ్రహీంపట్నం జడ్పిటిసి భూపితిగళ్ళ మహిపాల్ జనరల్ స్థానంలో మనకెందుకులే అన్నట్లు ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేతలు ఇలాగానే వర్గపోరు చేస్తే జడ్పిటిసి భూపతిగళ్ళ మహిపాల్, యువనాయకులు చిలుక మదుసుదన్‌రెడ్డి ని రేవంత్‌రెడ్డి ఇ ద్దరిలో ఒకరిని పట్నం బరిలో నిలిపే అవకాశాలు లేకపోలేదని క్రింది స్థాతయి కార్యకర్తలు గుసగుస వినిపిస్తుంది.
నున్వా నేనా అంటు ప్రచారం: ఒకవైపు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి పార్టీ కార్యాక్రమాలు విస్తుతంగా చేపట్టినప్పటికి ఆ కార్యాక్రమాలలో ఇద్దరి నేతలపై ఎమ్మెల్యే ఎవరని క్రింది స్థాయి కార్యకర్తలు ఇరువురిని ప్రశ్నిస్తున్నట్లు వినికిడి. వీరి నుంచి అధిస్టానం ఎవరికి టికెట్ యిచ్చిన శిరసా వహిస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్నారు. కానీ లోపల మాత్రం ఒకరంటె ఒకరికి పడదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోటీ అనివార్యం అంటు ఒకవర్గం చెప్పుతున్నప్పటికి లేదు ఆరు నారైనా ఈసారీ టికెట్ తనకే వస్తుందని మరోవర్గం దీమాతో ఉంది.
అధిష్టానం టికెట్ ఎవరికి యిచ్చినా పనిచేస్తాం:
మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
వంద ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు సహజమే కానీ ఎన్నికలప్పుడు అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించిన వ ర్గాలు విడనాడి టికెట్ యిచ్చినవారికే పనిచేస్తామని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి ( డైరెక్టర్) మన తెలంగాణతో అన్నారు. ప్రస్తుతం మర్రి నిరంజన్‌రెడ్డి వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాక్రమం చేసిన ఆయన వెన్నంటె ఉంటున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ యిచ్చిన అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని దీమా వ్యక్తం చేశారు.