Friday, December 20, 2024

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు న లమాద పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం హు జూర్‌నగర్‌లోని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉ త్తమ్‌కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్ధాయి మహిళా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ది గురించి ప్రజలకు గుర్తుచేయాలన్నారు. కా ంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలు గురించి కూడా తెలియజేయాలని కార్యకర్తలను కోరారు. అలాగే బూత్, వార్డు, గ్రామ, మండల, బ్లాక్, నియోజకవర్గస్ధాయిలో పూర్తిస్ధాయి కమిటీలు వే యాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి గొట్టెముక్కుల నిర్మల, చప్పిడి సావిత్రి, లక్ష్మీ, పలువురు మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News