Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పార్టీ బిసిలకు సముచిత స్థానం కల్పించాలి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ గెలవాలంటే బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అంబర్‌పేట టికెట్ విషయంలో  నాపై దుష్ప్రచారం జరుగుతోంది
రెడ్లకు నేను వ్యతిరేకం కాదు
నేను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుంది
కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే జాబితాను విడుదల చేసేందుకు అధిష్టానం కసరత్తు వేగవంతం చేసిన తరుణంలో బిసిలకు సముచిత స్థానం ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలవాలంటే బిసిలకు ప్రాధాన్యం కల్పించాలని ఆయన సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబర్‌పేట టికెట్ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తాను పోటీ నుంచి తప్పుకున్నానని అపవాదు వేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలు తనను బాధిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు తానెప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లేనని, బడుగు, బలహీన వర్గాల వారి పక్షానే తాను నిలుస్తానన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తాను రెడ్లకు వ్యతిరేకం కాదన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం జరగాలన్నదే తన తాపత్రయం అని చెప్పారు. తాను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని మౌనంగా ఉంటున్నానని, కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్ర కోణం ఉందని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇకకైనా తప్పును సరిదిద్దుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News