Friday, January 24, 2025

వైఎస్ షర్మిల చేరికతో ఎపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి నేత మాణిక్కం ఠాగూర్

మనతెలంగాణ/హైదరాబాద్: వైఎస్ షర్మిల చేరికతో ఎపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోందని ఏఐసిసి నేత మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఏఐసిసి నేత మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ ఆమె చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునరుజ్జీవం లభించిందని ఆయన అన్నారు.

అయితే పార్టీలో చేరిన షర్మిలకు ఏ పదవి కట్టబెట్టాలో త్వరలో అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంలో కాంగ్రెస్ ఎపి మిషన్ ప్రారంభమైందని అన్నారు. ఎపిలో బిజెపికి ప్రాంతీయ పార్టీలన్నీ అనుకూలమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం చేసిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News