Tuesday, December 24, 2024

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది: దీపాదాస్ మున్షి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ఎఐసిసి ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు. గాంధీ భవన్‌లో టిపిసిసి అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎఐసిసి ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్షి మీడియాతో మాట్లాడారు. కష్టపడితే ఎంపి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్లాలని, బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం రాజకీయాలను తిప్పికొట్టాలని మున్షి పిలుపునిచ్చారు. ఎంపి ఎన్నికల కోసం పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News