Sunday, December 22, 2024

10లక్షల మందితో కాంగ్రెస్ బహిరంగ సభ..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 17న హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. నగరంలోని తుక్కుగూడాలో దాదాపు 10 లక్షల మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫోస్టోను ప్రకటించే అవకావం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 115 నియెజకవర్గాల తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తున్న సిఎం కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అదీష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News