Sunday, November 17, 2024

మేడిగడ్డకు కాంగ్రెస్.. నల్గొండకు బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కృష్ణా జలాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పంచాయతి నడుస్తోంది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో మీరు తప్పు చేశారంటే.. మీరు తప్పు చేశారంటూ ఇరు పార్టీలు మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించమని అసెంబ్లీలో తీర్మారం చేసింది. అనంతరం కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని.. మేడిగడ్డ అందుకే కూలిపోయిందని.. ఎమ్మెల్యేలందరూ ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డకు ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేల బృందం బయల్దేరి వెళ్లింది.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ సర్కార్ కు తెలివిలేక కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ కుట్రను ప్రజలకు వివరిస్తామంటూ కెసిఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ చలో నల్గొండకు పిలుపునిచ్చారు. దీంతో ఈరోజు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బస్సుల్లో పయనమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News