Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పార్టీ దుకాణం మూసుకునుడే..

- Advertisement -
- Advertisement -

ఎలిగేడు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుకాణం మూతపడుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎలిగేడు, ర్యాకల్‌దేవ్‌పల్లి, రాములపల్లి, నారాయణపల్లి, లాలపల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదిక నిర్వహించారు.

ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి 24 గంటల కరెంటు ఇస్తుంటే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిన్నపిల్లల మాటలు మాట్లాడుతూ రైతుల మనోదైర్యాన్ని దెబ్బతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇలాకాలో రైతులు గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతున్నారని, అదే కాంగ్రెస్ హయంలో టార్చిలైట్లు పట్టుకొని పొలాల గట్ల వద్ద ఉండే వారని ఎద్దేవా చేశారు.

మూడు గంటల కరెంటు అంటూ రైతులను భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, నాయకులను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు అందించే మూడు పంటల కరెంటు కావాలో… కాంగ్రెస్ అందిస్తానంటున్న మూడు గంటల కరెంటు కావాలో రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్మెన్ మండిగ రేణుక రాజనర్సు, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు సమ్మయ్య, న్యాతరి పోచాలు, బద్దం తిరుపతి రెడ్డిలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News