Saturday, December 28, 2024

రాజస్థాన్ తిరిగి కాంగ్రెసే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఎదుర్కొంటుందని , తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేలా ముందుకు వెళ్లుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తిరిగి పగ్గాలు చేపట్టలేవనే తంతు సాగుతోంది. అయితే తమ పార్టీ దీనిని ఇప్పుడు తిరగరాస్తుందని, అధికార వ్యతిరేక ఓటు పనిచేయకుండా చూసుకుంటామని కెసి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఎడాది చివరిలోగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. చాలా కాలంగా సిఎం అశోక్ గెహ్లోట్ , సచిన్ పైలట్ మధ్య రాజకీయ చిచ్చు రగులుతోంది. పోటాపోటీ సభలు , కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరి మధ్య జగడం నివారించేందుకు , సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు సాగించింది. విభేదాలు వీడండి, ముందు సఖ్యతతో మెదలండనే హితవుతో వారికి నచ్చచెప్పేందుకు ఖర్గే, రాహుల్ యత్నించారు.

సంబంధిత కీలక సమావేశం తరువాత కెసి వేణుగోపాల్ గురువారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని , ఇందుకు అన్నివిధాలుగా పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఎన్నికలకు తగు వ్యూహాల ఖరారుకు అత్యంత ఫలప్రదమైన సమావేశం జరిగిందని చెప్పిన కెసి ఈ భేటీకి నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ఎఐసిసి రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌ఛార్జి సుఖ్జీందర్ సింగ్ హాజరయ్యారని తమ ట్వీటులో తెలిపారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి గెహ్లోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇటీవల ఆయన రెండు పాదాలకు ఫ్రాక్చర్ అయింది. క్రమేపీ కొలుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లో అన్ని వర్గాలకు అవసరం అయిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటిని ప్రజలు విశ్వసిస్తున్నారని, పార్టీలో పూర్తి స్థాయి సమైక్యతతో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియచేస్తూ తిరిగి ప్రజల ఆశీస్సులు పొందడం, నెగెటివ్ ఓటను అధిగమించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని పార్టీ తరఫున కెసి వేణుగోపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News