Sunday, January 19, 2025

రేపు ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపు ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డితో డిజిపి అంజనీకుమార్ భేటీ అయ్యారు. దీంతోపాటు ఎల్‌బి స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు సైతం చేపట్టారు. ఆదివారం (ఈరోజు) రాత్రి హోటల్‌కు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రావాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

వారందరూ వచ్చిన తరువాత రాత్రిలోపు సిఎల్పీ నేతను ఎన్నుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో ఆ దిశగా ఏఐసిసి నాయకులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలతో డికె శివకుమార్‌తో పాటు అధిష్టానం నియమించిన ఏఐసిసి నాయకులు వేర్వేరుగా సమావేశమై సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోనున్నారు. దీంతో సిఎం అభ్యర్థిని ప్రకటించి అతనితో నేడు ఎల్‌బి స్టేడియంతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News