Monday, January 20, 2025

‘4న ఛలో నెక్లెస్‌రోడ్ ’

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈ నెల 4వ తేదీన ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, జేఏసి ఛైర్మన్ గజ్జల కాంతం , మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ , కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్సీ తదితరులను సిఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పిలిపించుకుని ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ వారిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News