Friday, December 20, 2024

పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌కు 9 నుంచి 11 సీట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇదే జోరును కొనసాగించాలని ఊవ్విళ్లూరుతుంది. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎబిపి సి ఓటర్ సర్వే పేర్కొంది. గతంలో మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు 6 నుంచి 8 స్థానాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. బిఆర్‌ఎస్ పార్టీ 3 నుంచి 5 స్థానాలు, బిజెపి ఒకటి నుంచి మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇతరులు ఒకటి నుంచి రెండు సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బిజెపి-బిఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తే 14 సీట్లు గెలిచే అవకాశం ఉందని వివరించింది. 2019లో లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 29.8 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 38 శాతం ఓట్లు పడుతాయని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News