Wednesday, January 22, 2025

గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ  138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ ఆత్మనే సిద్దాంతంగా రచించుకొని ఆచరిస్తున్న పార్టీ ఏదైన ఉంటే అది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. మహాత్మగాంధీ ఇచ్చిన స్పూర్తిని కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ పాలనలో సమూలమార్పులు తీసుకొచ్చారని,

మహిళా రిజర్వేషన్ బిల్లును నాడు బిజెపి అడ్డుకుందని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే అది కాంగ్రెస్ నిర్ణయమే అని వివరించారు. దేశ ప్రజల పై బ్రిటిష్ విధానాలను రుద్దాలని బిజెపి ప్రయత్నిస్తుందని , రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ కోవిడ్ రూల్స్ తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి పై కేంద్రాన్ని కెసిఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జనవరి 26 నుంచి హత్ సే హత్ జోడో యాత్రకు కదలిరావాలని, వ్యక్తిగత సమస్యల పై కాకుండా ప్రజా సమస్యల పై పోరాడేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News