Tuesday, December 24, 2024

క్రైపిఎం పేసిఎం: కాంగ్రెస్ వినూత్న ప్రచారం..

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తాను ఎదుర్కొంటున్న అవమానాలపై ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా రోదించారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎద్దేవా చేసిన మరుసటి రోజే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటక కాంగ్రెస్ క్రై పిఎం పే సిఎం పేరిట వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. యువజన కాంగ్రెస్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌ను ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే.. తనకు జరిగిన అవమానాలపై ప్రధాని నరేంద్ర మోడీ కంటతడిపెట్టుకున్నారన్న వాదనను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ ఏడవలేదని, పైగా ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారని బొమ్మై చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే గత 9 సంవత్సరాలుగా ఏడుస్తోందని, అయినప్పటికీ ఆ పార్టీకి ప్రజల నుంచి సానుభూతి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read: జంతర్ మంతర్‌కు వెళ్లి వారి ‘మన్‌కీ బాత్’ వినండి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News