Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఖబడ్దార్

- Advertisement -
- Advertisement -
  • ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి మాటలపై నిరసనలో నిప్పులు చేరిగిన పద్మాదేవేందర్ రెడ్డి

మెదక్ టౌన్: తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటలు ఇస్తుంటే మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వి వాదస్పద వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ జిలాల అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రైతులకు రైతుబందు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమపథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని, ఓవైపు బిజెపి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. 70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్తితి ఉండేదని, అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని సిఎం కెసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి ఆలోచించారన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతులను పట్టించుకోలేదు. పైగా నిర్లక్షం చేశారని, దేశాన్ని పాలిస్తున్న పార్టీలు వ్యవసాయం, రైతులను చులకనగా చూస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ రైతు ఉన్నతికి ఉచిత కరెంట్ ఇస్తే అదితప్పా కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోతుందా రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తే రైతు బాగుపడుతాడా అని ప్రశ్నించారు. సరైన సమయానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. వడ్లు కొనెందుకు రాజకీయం, వడ్లు తడిస్తే రాజకీయం, కొన్న వడ్లకు పైసలు ఇచ్చే కాడ రాజకీయం ఇన్ని రాజకీయాలు చేసేది కాంగ్రెస్, బిజెపి పార్టీలేనన్నారు. ఏ రాజకీయం లేకుండా రైతుకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తున్న నాయకుడు సిఎం కెసిఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదిస్తూ రైతుల తరపున నిలదీస్తున్న ఏకైకనేత కెసిఆర్ అన్నారు. రైతులు సిఎం కెసిఆర్ గారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ జిల్లా అన్ని మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్మన్‌లు, సర్పంచ్, ఎంపిటిసిలు, రైతు బంధు నాయకులు, రైతులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News