Friday, December 20, 2024

కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పన్ను అధికారులు నాలుగేళ్ల కాలానికి ట్యాక్స్  రీ-అసెస్మెంట్ చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది.  న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్ లతో కూడిన ధర్మాసనం కాంగ్రెస్ వినతులను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. మరో సంవత్సరం రీ-అసెస్మెంట్ విషయంలో జోక్యం చేసుకోబోమని ఇదివరలో తీసుకున్న నిర్ణయం మేరకు పిటిషన్ ను పరిశీలించబోమని పేర్కొంది. ప్రస్తుత అంశం 2017 నుంచి 2021 సంవత్సరాలకు సంబంధించింది. కాంగ్రెస్ తన ఇదివరకటి పిటిషన్ లో అసెస్మెంట్ సంవత్సరాలు 2014-15 నుంచి 2016-17కు సంబంధించిన ప్రొసీడింగ్ లను సవాలుచేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News