Wednesday, December 18, 2024

రేపు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజాదీవెన పేరుతో మణుగూరులో సభను ఏర్పాటు చేయనుంది. ప్రజాదీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొనున్నారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల సభల్లో సిఎం రేవంత్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News