Thursday, November 14, 2024

సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులు
ముందుగా తెలంగణాలో సదస్సు
పార్టీ చీఫ్ ఖర్గే సారథ్యంలో సమావేశాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులను పార్టీ నిర్వహించనున్నది. సంస్థాగత శ్రేణులను ఉత్సాహపరిచేందుకు కార్యనిర్వాహక వర్గ సభ్యుల సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. పార్టీ తొలి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సు గురువారం తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో కె చంద్రశేఖర్ రావు సారథ్యంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

పార్టీ అటుపిమ్మట ఈ నెల 28న ఉత్తరాఖండ్‌లో, 29న ఒడిశాలో, ఫిబ్రవరి 3న ఢిల్లీలో, 4న కేరళలో, 10న హిమాచల్ ప్రదేశ్‌లో, 11న పంజాబ్‌లో, 13న తమిళనాడులో, 15న ఝార్ఖండ్‌లో రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులు నిర్వహిస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ తెలియజేశారు. ఆ సదస్సులో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీస్ బేరర్లతో సమావేశాలకు ఖర్గే అధ్యక్షత వహిస్తారని, ‘అంకితభావం గల మా శ్రేణులను మరింత శక్తిమంతం చేస్తారు’ అని వేణుగోపాల్ అంతకుముందు ఒక పోస్ట్‌లో తెలిపారు.

‘బూత్ స్థాయి వరకు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అయింది’ అని ఆయన తెలిపారు. మరొక వైపు పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు సన్నాహకాలు సాగిస్తోంది. ఖర్గే ఈ నెల ఆరంభంలో పార్టీ కీలక సమావేశంలో ప్రసంగించినప్పుడు, రేయింబవళ్లు పాటపడడం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయగలమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News